హుజూరాబాద్ ఆగస్టు 29 ( వై 7 న్యూస్) :
హుజురాబాద్ నియోజకవర్గంలోని కరీంనగర్ రోడ్డులో మొదటిసారిగా యం.యం. హుస్సేన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టంప్స్ బాక్స్ క్రికెట్ ను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ లోని మాదిరిగా హుజురాబాద్ లో బాక్స్ క్రికెట్ నెలకొల్పడం శుభ పరిణామం అని అన్నారు,యువత సెలవులలో సమయాన్ని వృధా చేయకుండా ఆటలవైపు దృష్టి మళ్లించాలని తెలిపారు.ఈ సందర్భంగా బాక్స్ క్రికెట్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు మహమ్మద్ మక్బూల్ హుస్సేన్ ,మహమ్మద్ ముషు ని అభినందించారు,ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ ,హుజురాబాద్ సిఐ తిరుమల్ ,జామే మస్జిద్ ఈద్గా,ఖబరస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ , ముస్లిం మత గురువులు ముఫ్తీ షాకిర్,నయీం, మీర్జా ఇమ్రాన్ బేగ్,యువకులు పాల్గొన్నారు.