మణుగూరు, ఆగస్టు 29వై 7న్యూస్
సింగరేణి సేవ సమితి , సింగరేణి వైద్య, ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మణుగూరు మండలం తిర్లాపురం పంచాయితీ పరిధిలోని పునరావాస ఆదివాసీ గ్రామమైన పెద్దిపల్లి గ్రామంలో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ఆదేశం మేరకు గురువారం నాడు సింగరేణి ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో స్త్రీ, పురుషులు, వృద్ధులు అధిక సంఖ్యలో విచ్చేసినారు. ఈ వైద్య శిబిరంలో మొత్తం 75 మందికి దగ్గు, జ్వరాలు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు తదితర వ్యాధుల నివారణకు గాను ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి గ్రామంలోని నివాసాలు, వీధులలో దోమల నివారణకు దోమల మందు పిచికారి చేయడంతో పాటు కాలువలలో రోడ్డుకు ఇరువైపుల బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగింది. వ్యాధుల బారిన పడకుండా గృహ , వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించవలసిన ఆవశ్యకత పై సింగరేణి వైద్యులు పెద్దిపల్లి గ్రామస్తులకు సింగరేణి వైద్యులు డా. శేషగిరి రావు అవగాహన కల్పించారు.
అనంతరం గ్రామాస్తులకు, చిన్నారులకు డా. శేషగిరి రావు గారు బన్ రొట్టెలు తమ సొంత ఖర్చుతో అందజేయడంతో పాటు ఉచితంగా మాస్కుల పంపిణీ కూడా చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ స్టాఫ్ నర్స్ శ్రీమతి రత్న కుమారి, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ రామ రావు, ఆసుపత్రి సిబ్బంది రాము, విజయ్, ఆశ వర్కర్ శ్రీమతి రోజా, గ్రామ పెద్ద భీమయ్య, సేవ కో ఆర్డినేటర్ శ్రీ కె. వీ. మారేశ్వర రావు, మాజీ సేవ కో ఆర్డినేటర్ శ్రీ యండి యూసఫ్, పెద్ద సంఖ్యలో పెద్దిపల్లి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.