వర్ని,ఆగస్టు: 28 వై 7 న్యూస్
బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం శ్రీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కథనం ప్రకారం.. మాక్లూర్ మండలం చిక్లికి చెందిన యువకుడు వంశిని అతడి గ్రామంలో దింపేందుకు నగరానికి చెందిన యువకుడు రాజేశ్, డ్రైవింగ్ కోసం ఆకాశ్ వెళ్లాడు. ఆకుల కొండూర్ వద్ద ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొంది. దీంతో ఘటనా స్థలంలోనే వంశి, రాజేశ్ ప్రాణాలు కోల్పోయారు. డ్రైవింగ్ చేస్తున్న రాజేశ్ కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీని రోడ్డుకి అడ్డంగా నిలపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Post Views: 133









