మిర్యాలగూడ, ఆగస్టు28 వై 7న్యూస్;
మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రజల ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్ బుధవారం అకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ నారాయణ రెడ్డి. హాస్పిటల్ లో ప్రతీ వార్డ్ సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, హాస్పిటల్ లోని సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం డాక్టర్స్ , సిబ్బంది రిజిస్టర్స్ చెక్ చేసి డైట్ సంబంధించిన మెనూ నీ పరిశీలించడం పరిశీలించారు.అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో, పరిసరాలలో క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేస్తూ శుభ్రంగా ఉంచాలని శానిటైజేషన్ పై ఇకపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.. అలాగే డాక్టర్స్ క్రమం తప్పకుండా రావాలని, వారి డ్యూటీ సమయంలో అందుబాటులో లేనిచో వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. అలాగే పేషెంట్స్ కి మంచి పోషక ఆహారాలు అందించాలని, ఇకపై ఏరియా ఆసుపత్రి పై ప్రజలనుండి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సహించబోమని అన్నారు.. అనంతరం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు మానేయాలని అన్నారు.. మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన చర్యలు మేము తీసుకుంటున్నాం.. ఏదైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా మాకు తెలియజేయండి వారి పై వెంటనే చర్యలు తీసుకుంటాము అని అన్నారు. అలాగే కొత్తగా నిర్మాణం చేస్తున్న హాస్పిటల్ బిల్డింగ్ నీ కూడా త్వరగా పూర్తయ్యేలా కావాల్సిన నిధులను విడుదల చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది .. అలాగే రైస్ మిల్కర్స్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి పలు స్వచ్చంధ సంస్థల ద్వారా హాస్పిటల్ లో కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రణాలికను సిద్ధం చేసాము అని అన్నారు. నా ఈ పదవి కాలం పూర్తయ్యే సరికి మిర్యాలగూడలో ప్రతీ పేద మధ్యతరగతి వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చి దిద్దుతాం అని అన్నారు.