. భావితరాలకు ఆదర్శం మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ
. మాజీ ఎంపిటిసి కమటం నరేష్
అశ్వాపురం, ఆగస్టు 20 (వై 7న్యూస్);
మొండికుంటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ గారి 80వ జయంతినీ ఘనంగా నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి గ్రామ అద్యక్షుడు కొండబత్తుల ఉపేందర్ , రావిడి శంబరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీటీసీ కమటం నరేష్ మాట్లాడుతూ,ఐటీ రంగం అభివృద్ధి సాంకేతిక రంగాన్ని డెవలప్ చేసిన ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీ ,తల్లి ఇందిరా గాంధీ బాటలో నడుస్తూ వారి ఆశ సాధనలో పనిచేసి మరణాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడిన గొప్ప మానవతావాది రాజీవ్ గాంధీ అని , అటువంటి వ్యక్తులు చిన్న వయసులో (ఎల్ టి టి ఈ) సంస్థ, ఉగ్రవాది చేతిలో మరణించడం భారతదేశానికి తీరనిలోటు అని , రాజీవ్ గాంధీ నీ , ప్రేరణగా తీసుకొని యువత ముందుకు పోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సొసైటీ ఛైర్మన్ తుక్కనీ మధు సుదన్ రెడ్డి,కందిమల్ల రామిరెడ్డి,బుర్రి సాయిలు,పగడిపల్లి కొమరయ్య,దేరంగుల వెంకులు,తోట నాగయ్య, కొల్లు నర్సిరెడ్డి,చిట్యాల సత్యం, నరసింహారెడ్డి యువజన నాయకులు అభిమానులు పాల్గొన్నారు.









