. బామ్మర్దుల ఆస్తులు సర్వం స్వాహా
. ఖద్దర్ చోక్కాల మాటున రికార్డులు తారు మారు
. కన్నింగ్ అల్లుడుకే సహకరిస్తున్న రెవిన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు
. మాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ మీడియాను ఆశ్రయించిన బాధితులు
పినపాక ,ఆగస్టు20 (వై 7 న్యూస్);
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన గత ఐదు సంవత్సరాలు ధరణి పేరుతో అనేక మంది రైతులు ఆగం అయినారు. కద్దరు చోక్కాల మాటున కన్నింగ్ దొంగలు దొరికిన కాడికి కబ్జా చేశారు. రక్త సంబంధాలను సైతం లెక్కచేయకుండా భూ రికార్డులు ధరణి సహాయంతో తారు మారు చేశారు అని చెప్పుకోవాలి. ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయిస్తూ వారిని బానిసలుగా మార్చి కబ్జాలు చేసే బడా బాబులకు రెవిన్యూ అధికారుల వంతు సహకారం అందేలా ప్రయత్నం చేశారు అంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. దాంతో మా జీవితాలు రోడ్డున పడ్డాయి అంటూ బాధపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మా భూములకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఆనాడు కబ్జాలు చేసిన దుర్మార్గులే నేడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం వలన మా స్థిరాస్తి అయినా భూముల భూ రికార్డులు సవరణలు కావడం లేదు అంటూ మండిపడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన బండ్ల ముత్తయ్య లచ్చమ్మ లేటు అనే బడా దంపతులకు ముగ్గురు కుమారులు. అయితే బండ్ల ముత్తయ్యకు అనేకంగా ఆస్తులు ఉండడంతో తన ఆస్తి తన పెద్ద కొడుకు అయినా కన్నయ్య పిల్లలకు నడిపి కొడుకు అయినా వెంకయ్య పిల్లలకు చిన్న కొడుకు అయినా చిన్న మల్లయ్య పిల్లల కు సరి సమానంగా చెందాలనే ఆశయంతో బండ్ల ముత్తయ్య తమ వీలునామా లో తెలిపారు. కానీ బండ్ల ముత్తయ్య చిన్న కొడుకు చిన్న మల్లయ్య కుమారులు అక్షరం ముక్క కూడా చదువుకోకపోవడంతో బండ్ల వెంకయ్య ఇల్లరికం అల్లుడు అయినా బత్తుల వీరయ్య అనే యువకుడు ఏకంగా తన చిన్న మామ కొడుకులైన బామ్మర్దుల ఆస్తులకు గాలం వేశారు. తనకున్న రాజకీయ తెలివితేటలతో,పలుకుబడితో మా భూములు కబ్జా చేశారు అంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. చదువుకున్న మేధావినే కాక రాజకీయ ఒడిదుడుకులు తెలిసిన బత్తుల వీరయ్య బండ ముత్తయ్య రాసిన వీలునామాను సైతం తారు మారు చేసి తమ స్థిరాస్తి అయిన భూములను కబ్జా చేశారు అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మారిన భూ రికార్డులు నేడు ప్రభుత్వం మారిన న్యాయం జరగడం లేదంటూ బాధపడుతున్నారు. స్థిరాస్తులు వీలునామా లు పరిశీలించి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు మాకు న్యాయం చేయాలి అంటూ వేడుకుంటున్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించి పేదలకు న్యాయం చేసేలా స్పందించాలి అంటూ వేడుకుంటున్నారు. ఆనాటి టిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన కబ్జాల బాబును నేడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకున్నారు అంటూ మండిపడుతున్నారు. బడా బాబు కావడంతో మాకు అన్యాయం చేస్తారా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బండ్ల ముత్తయ్య వీలునామా పరిశీలించి మా భూ రికార్డును సవరణలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారు..









