E-PAPER

హెల్త్ ప్రోగ్రాం లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు; డి ఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప.

జోగులాంబ గద్వాల జిల్లా, ఆగస్టు (20 వై7 న్యూస్)

వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వడ్డేపల్లి రాజోలి ఐజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఆరోగ్య కార్యక్రమాలలో తక్కువ పర్ఫామెన్స్ ఉన్నందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప అగ్రహం వ్యక్తపరిచారు.హెల్త్ ప్రోగ్రాం లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.అన్ని ప్రోగ్రాంలో రెండు మూడు రోజులలో ఇంప్రూవ్ కావాలని సంబంధిత సూపర్వైజర్లు వారి వారి సబ్ సెంటర్ లందు పర్యవేక్షణ చేసి పూర్తయ్యేలా చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. వివిధ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ జి రాజు , డాక్టర్ రిజ్వానా తన్వీర్ , డాక్టర్ ప్రసూన రాణి ,ప్రోగ్రాం ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్లు పీహెచ్సీ సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News