బాన్సువాడ, Y7న్యూస్ తెలుగు;బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో భాగంగా స్థానిక సంస్థలలో బీసీలకు 23% నుండి 42% పెంచుతామని ప్రకటించడం జరిగింది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కులగణన చేపట్టి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ పెంచుతామన్నారు అదేవిధంగా స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ చేస్తామన్నారు ఈ విధంగా రిజర్వేషన్లు పెంచడం ద్వారా సుమారుగా పంచాయతీల్లో, మున్సిపాలిటీలో కొత్తగా 23973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుంది కాబట్టి ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్స్ నిర్వహిస్తే బీసీలకు ఇచ్చిన హామీ నెరవేరదు ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 8 నెలలు గడుస్తున్నా బీసీ రిజర్వేషన్ల రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది
*గ్రామపంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కనీస వేతన అందజేస్తాం అన్నారు
*గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లకు గౌరవ వేతనం నెలకు 1500 ఇస్తాం అన్నారు.
మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీ సభ్యులకు, మాజీ జెడ్పిటిసి లకు గౌరవ పెన్షన్ అందజేస్తాం అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ గౌరవ వేతనం పెంచుతాం అన్నారు. మీరు ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.









