*ఛీ.. గుడ్లు!-చెడిపోయాయి
*కాంట్రాక్టర్ తో కుమ్మక్కైన సిడిపిఓ…
మధిర;అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు అందించే పౌష్టికాహారం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు
న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు నాణ్యత లేని పౌష్టికాహారం సరఫరా చేస్తున్నారని కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మధిరలోని ఎంప్లాయిస్ కాలనీలో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే ముస్లింకాలనీ, హనుమాన్ కాలనీ, ఎంప్లాయిస్ కాలనీల్లో నెలనెలా మాదిరిగానే గురువారం కూడా కోడిగుడ్లను అంగన్వాడీ టీచర్లు పంపిణీ చేశారు. వాటిని ఇంటికి తీసుకెళ్లిన తల్లులు వాటిని పరిశీలించి అవాక్కయ్యారు.
అంగన్వాడీల్లో మురిగిన గుడ్ల పంపిణీ పై ఐసీడీఎస్ అధికారులకు తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. మధిర ఎంప్లాయిస్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన గుడ్లను పగులగొట్టి చూడడంతో మురుగు వాసన రావడంతో భయానికి గురి అయ్యారు.మురిగిపోయిన కోడిగుడ్లను
*బయటపడేసిన లబ్ధిదారులు…
వీటిని తమ పిల్లలకు పెడితే పరిస్థితి ఏమిటని నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులు
ఈ విషయాన్ని అంగన్వాడీ టీచర్ల దృష్టికి తీసుకెళ్లగా.. ఐసీడీఎస్ ఉన్నతాధికారులకు వివరిస్తామని చెప్పారు. మధిర సీడీపీవో శారదాశాంతి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ పై ప్రభుత్వానికి నివేదికను పంపిస్తానని హామీ మాత్రమే ఇచ్చారు. సదరు కాంట్రాక్టర్ దగ్గర నుండి సిడిపిఓ కమిషన్ డబ్బులు తీసుకుంటున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి.. పర్యవేక్షణ లేకుండా కమిషన్లకు కక్కుర్తి పడి నాణ్యత లోపం అయిన గుడ్లను లబ్ధిదారులకు అందిస్తున్న సంబంధిత అంగన్వాడి టీచర్ ,సిడిపిఓ పై జిల్లా అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు..









