భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకునే విషయంలో జరిగిన గొడవ తీవ్ర ఘటనకు దారితీసింది. మహిళా ప్రయాణికురాలు కండక్టర్‌ను బస్సులో నుంచి కిందకు నెట్టివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల ప్రెస్‌నోట్ ప్రకారం.. ఆదివారం మిట్టగూడెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై పడిపోయిన కండక్టర్‌పై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె కాళ్లకు తీవ్ర రక్తగాయాలయ్యాయి.
బస్సు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మిట్టగూడెంకు చెందిన బానోత్ మౌనికను సోమవారం అరెస్టు చేసి మణుగూరు కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.
Post Views: 318








