మాజీ ఎస్టీ కమిషన్ మెంబర్ మరియు మాజీ జడ్పిటిసి చిచ్చడి మురళి సమక్షంలో చేరారు
చింతూరు,( వై7 న్యూస్), అక్టోబర్ 26: చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీ లో చుక్కలపాడు గ్రామము నుండి 36 కుటుంబాలు వైసీపీ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు మరియు పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై , మరియు వైసీపీ స్థానిక నాయకత్వం పై నమ్మకం తో పార్టీలో చేరినట్లు చుక్కలపాడు గ్రామ పూజారి మరియు పటేల్ రవ్వ జోగయ్య, మడవి ఎర్రయ్య, గ్రామస్థులు బొజ్జయ్య, ఉంగయ్య, పోడియం ఆడమయ్య, దేవయ్య తెలిపారు. మాజీ ఎస్టీ కమిషన్ మెంబర్ చిచ్చడి మురళి వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో ఏళ్ల నుండి సీపీఎం పార్టీలో ఉన్నపటికీ ఎటువంటి అభివృద్ధినీ నోచుకోలేదు అని వారు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీటీసీ అభ్యర్థి ఉయిక నాంచారి నీ పరిచయం కార్యక్రమం నిర్వహించి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో మన అభ్యర్థినీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఎడమ అర్జున్, మాజీ సర్పంచ్ సవలం సత్తిబాబు, మాజీ ఉప సర్పంచ్ బి బాబురావు, చింతూరు మాజీ సర్పంచ్ కారం కన్నారావు, నాయకులు యూత్ అధ్యక్షులు మడవి రాజు, మీడియం లక్ష్మణ్, సోయం నాగేశ్వరావు, వెట్టి జోగయ్య, కుమార్, నర్సింహులు, బాబురావు,రమణ, మడకం రమేష్, వైసీపీ కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.








