E-PAPER

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా పై క్రేజీ అప్డేట్..!

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbham) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జగపతిబాబు(Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయము రా సీజన్ 2 (JNR Season 2)కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వరుస ప్రోమోలను విడుదల చేస్తున్నారు . ఈ నేపథ్యంలోనే నటుడు జగపతిబాబు గాడ్ ఆఫ్ వార్(God Of War) గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రశ్నలు వేశారు. ఈ సినిమా గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిందని తెలిపారు. ఎన్టీఆర్ కి కూడా కథ నేరేట్ చేశామని, ఎన్టీఆర్(NTR) కూడా ఈ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్రివిక్రమ్ తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందనే విషయాన్ని కూడా త్రివిక్రమ్ ఈ సందర్భంగా తెలిపారు.

ప్రస్తుతం ఆదర్శ కుటుంబం సినిమా పనులలో బిజీగా ఉన్నాము ఈ పనులు పూర్తి అయిన వెంటనే గాడ్ ఆఫ్ వార్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతాయని త్రివిక్రమ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా కథ అనుకున్న సమయంలో నా మనసులో ఆరు ముఖాలు కలిగిన బొమ్మ కనిపించడంతో నా నోటి వెంట మాటలు వాటంత అవే బయటకు వచ్చాయని ఇదంతా కూడా ఆయన సంకల్పమే అంటూ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ సినిమాకు సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందనే విషయాన్ని ప్రకటించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా గాడ్ ఆఫ్ వార్ పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు గాడ్ ఆఫ్ వార్ అనేది టైటిల్ కాదని ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వేరే ఉంటుందని త్రివిక్రమ్ తెలియజేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను చిత్ర బృందం అధికారికంగా తెలియజేయబోతున్నారని తెలుస్తుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!