మణుగూరు:
మణుగూరుకు చెందిన హోంగార్డు చారి పెద్ద కుమారుడు కటుకోజ్వల కేశవ్ వికాస్ ఎస్జీఎఫ్ (SGF) అండర్-19 ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు.
భద్రాచలంలోని చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీలో కోచ్ శరణ్ తేజ వద్ద శిక్షణ పొందుతూ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న కేశవ్ వికాస్, జిల్లా స్థాయి జట్టుకు ఎంపిక కావడంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, కఠిన సాధనతో జిల్లా స్థాయి జట్టులో చోటు దక్కించుకుని మణుగూరు పేరును నిలబెట్టిన కేశవ్ వికాస్‌ను పట్టణంలోని క్రీడాభిమానులు, పుర ప్రముఖులు అభినందించారు. రాబోయే మ్యాచ్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.
Post Views: 67







