ములుగు జిల్లా అక్టోబర్ 26 Y7 న్యూస్ తెలుగు
ములుగు జిల్లాలో సమాచార హక్కు చట్టం జిల్లా నోడల్ అధికారి శ్రీ వి.రవికుమార్ (జిల్లా రెవెన్యూ ఆఫీసర్) ఆర్డర్ కాపీ అందజేశారుvములుగు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ హేమంత్ భోర్కడే ఐఏఎస్ ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం–2005 సమర్థవంతమైన అమలు కోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమించబడినందుకు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ములుగు జిల్లా అధ్యక్షుడు పసులాది ముఖేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సమాచార హక్కు చట్టం జిల్లా నోడల్ అధికారి జిల్లా రెవెన్యూ అధికారి వి రవికుమార్ చేతుల మీదుగా నియామక ప్రొసీడింగ్స్ కాపీని స్వీకరించడం జరిగింది. ఈ నియామకానికి సహకరించిన జిల్లా కలెక్టర్ కి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)కి జిల్లా రెవెన్యూ అధికారికి మరియు జిల్లా పరిపాలన అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ప్రభుత్వ శాఖల నుంచి పారదర్శకమైన సమాచారం అందించడం అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించడం ప్రజల హక్కులను పరిరక్షించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సభ్యుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ సమాచార హక్కు చట్టం అమలులో ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తానని పసులాది ముఖేష్ పేర్కొన్నారు








