E-PAPER

అశ్వాపురంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు, కళ్లజోళ్ల పంపిణీ

అశ్వాపురం, అక్టోబర్ 13, Y7 న్యూస్ తెలుగు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో బుధవారం (అక్టోబర్ 14) ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ అశ్వాపురం స్టార్స్, వైరా లయన్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

మండల కేంద్రంలోని కాలవ బజారులో ఉన్న సాయిబాబా ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగనుంది. ఈ శిబిరంలో వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందించడంతో పాటు, కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలని లయన్స్ ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ సత్య ప్రకాష్ నల్లగట్ల విజ్ఞప్తి చేశారు.

Y7 న్యూస్ తెలుగు – ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!