E-PAPER

రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ తవ్వకాలు.. యథేచ్ఛగా ఎర్రమట్టి తరలింపు!

సాంబాయిగూడెం అటవీ ప్రాంతంలో జేసీబీల మోత | వందలాది ట్రాక్టర్లతో అక్రమ రవాణా | అనుమతులు లేవంటున్న క్షేత్రస్థాయి సమాచారం
మణుగూరు ;
నిబంధనలు కఠినంగా అమలు కావాల్సిన రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అక్రమార్కులు బరితెగించారు. విలువైన అటవీ భూమిని ధ్వంసం చేస్తూ యథేచ్ఛగా ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్న వైనం తీవ్ర కలకలం రేపుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సాంబాయిగూడెం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పగిడేరు బయలు వైపు వెళ్లే మార్గంలో కొందరు వ్యక్తులు భారీ ఎత్తున జేసీబీలను మోహరించి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టినట్లు తెలిసింది. సుమారు 150 నుంచి 200 ట్రిప్పుల దాకా ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని సమాచారం. పచ్చని అటవీ ప్రాంతంలో నిరంతరాయంగా తవ్వకాలు సాగుతుండటంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతుల ఊసే లేదు:
రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో తవ్వకాలు జరపాలన్నా, మట్టిని తరలించాలన్నా అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి. అయితే ఈ తవ్వకాలకు సంబంధించి అటవీ శాఖ నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు తీసుకోలేదని సమాచారం అందుతోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ పట్టపగలే అక్రమ రవాణా సాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ అక్రమ తవ్వకాలపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!