బేడే సతీష్, తీగల రవి, తీగల కవిత, పయ్యాల నాగేశ్వరరావుకు బాధ్యతలు



చింతూరు, (వై7 న్యూస్)అక్టోబర్ 10:
రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలో చింతూరు మండలానికి చెందిన నలుగురు నాయకులకు చోటు లభించింది. బేడే సతీష్, తీగల రవి, తీగల కవిత, పయ్యాల నాగేశ్వరరావులను కమిటీ సభ్యులుగా నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ రూపొందించడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడం, అభ్యర్థుల ఎంపికలో సహకరించడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం వంటి అంశాల్లో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. చింతూరు మండలానికి చెందిన నలుగురు నాయకులకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలో అవకాశం కల్పించడంపై మండలంలోని జనసైనికులు, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నలుగురు నాయకులకు అభినందనలు తెలియజేస్తూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా కృషి చేసి జనసేన పార్టీ విజయానికి తోడ్పడాలని ఆకాంక్షించారు.









