E-PAPER

హరీష్ రావును కలిసిన యువజన నాయకుడు రావులపల్లి పృథ్వి

భద్రాచలం, అక్టోబర్ 8, 2026:

తెలంగాణ ఉద్యమ నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ని యువజన నాయకుడు రావులపల్లి పృథ్వి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలపై ఆయనతో చర్చించారు.

ముఖ్యంగా భద్రాచలం పట్టణం నుంచి వాజేడు వరకు ఉన్న ప్రధాన రహదారి దయనీయ పరిస్థితిని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ రహదారిపై నిత్యం వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, భద్రాచలం–వాజేడు రహదారి అభివృద్ధికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా కృషి చేయాలని హరీష్ రావు ని కోరారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ ఇంచార్జి శ్రీ రావులపల్లి రాంప్రసాద్ గారి తనయుడు, యువజన నాయకుడు రావులపల్లి పృథ్వి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!