కొత్తగూడెం, సెప్టెంబర్ 12 (వై7 న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలో ఎస్ అండ్ పి సి విభాగంలో విధులు నిర్వహించిన జేమేదార్ చంద్రశేఖర్ అకాల మరణం పట్ల ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శనివారం చంద్రశేఖర్ పార్ధివ దేహానికి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు, సెంట్రల్ కమిటీ సభ్యుడు బందెల విజయేందర్, మణుగూరు జూనియర్ ఇన్‌స్పెక్టర్ వంగపల్లి సుమన్, కొప్పుల శంకర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రశేఖర్ సేవలను స్మరించుకున్నారు. ఆయన అకాల మరణం ఉద్యోగ వర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. అలాగే చంద్రశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై చంద్రశేఖర్‌కు ఘనంగా నివాళులర్పించారు.









