E-PAPER

దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం: రావులపల్లి నరసింహారావు

అశ్వాపురం, సెప్టెంబర్ 8 (Y7 న్యూస్): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, దళిత నాయకుడు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు రావులపల్లి నరసింహారావు తీవ్రంగా ఖండించారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులను దూషిస్తూ, స్పీకర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడటం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో అసంతృప్తి, ఆగ్రహానికి దారితీస్తాయని అన్నారు. రాజకీయాల్లో హుందాతనం, రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచించారు.
తాతా మధు వ్యాఖ్యలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చట్టం ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
అలాగే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై స్పందించి, స్పీకర్‌కు మరియు దళిత సమాజానికి జరిగిన అవమానంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని రావులపల్లి నరసింహారావు డిమాండ్ చేశారు.
రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలానికి తావు ఇవ్వకూడదని హితవు పలికారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెంచేలా రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!