చింతూరు (వై7 న్యూస్ తెలుగు), సెప్టెంబర్ 08: ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బొడ్డు హేమంత్ బదిలి . ఆయన ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు అయిన పోలవరం జిల్లాలోని చింతూరు డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (వాల్తేరు) ప్రాంతానికి చెందినవారు. విశాఖపట్నంలోనే బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష-2022లో జాతీయ స్థాయిలో 469వ ర్యాంకు సాధించి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత, ఏపీ క్యాడర్‌కు కేటాయించబడ్డారు. మొదట గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండెంట్‌గా పనిచేసిన ఆయన, నవంబర్ 2025లో చింతూరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
Post Views: 118









