మణుగూరు, సెప్టెంబర్ 5 (వై7 న్యూస్): మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం గ్రామంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో పాఠశాలకు వచ్చి తరగతులను నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంత కృషి చేస్తున్నారో తమ అనుభవాల ద్వారా వివరించి, గురువుల పట్ల గౌరవాన్ని చాటుకున్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షహీన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలు, విద్యారంగానికి ఆయన చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు.
అనంతరం ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక గేమ్స్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య అకాడమిక్ డీన్ భాస్కర్ రెడ్డి, టెన్త్ క్లాస్ ఇన్చార్జ్ దామల్ల స్వరూపరాణి, ప్రైమరీ ఇన్చార్జ్ నస్రిన్, ప్రీ-ప్రైమరీ ఇన్చార్జ్ వెంకటరమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








