E-PAPER

10,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ‘పోకో X8 పవర్’..

పోకో సంస్థ తన మిడ్-రేంజ్ X8 సిరీస్‌లో నాలుగో మోడల్‌గా ‘పోకో X8 పవర్’ (Poco X8 Power)ను శుక్రవారం భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సాధారణ ‘పోకో X8’తో పాటు ఆవిష్కరించారు. ఇప్పటికే భారత్‌లో విడుదలైన ‘పోకో X8 ప్రో’, ‘పోకో X8 ప్రో మాక్స్’ సరసన ఈ రెండు ఫోన్లు చేరాయి. పోకో X8 పవర్ రెండు రంగుల ఎంపికలలో లభిస్తుండగా, సాధారణ మోడల్ మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. పవర్ మోడల్‌లో 10,000mAh బ్యాటరీని అమర్చారు, కాగా పోకో X8లో 9,000mAh బ్యాటరీ ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో వేర్వేరు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లతో వస్తున్నాయి.

పోకో X8 పవర్, పోకో X8 ధర & లభ్యత: భారతదేశంలో పోకో X8 బేస్ వేరియంట్ ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు, పోకో X8 పవర్​ ధర రూ. 35,999 నుంచి మొదలవుతుంది. కంపెనీ రూ. 2,000 కూపన్ డిస్కౌంట్, రూ. 1,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. వీటితో కలిపి చూస్తే, ఈ ఫోన్‌ల వాస్తవ ప్రారంభ ధరలు వరుసగా రూ. 26,999, రూ. 32,999గా ఉంటాయి.

RAM & స్టోరేజ్ వేరియంట్లు అసలు ధర డిస్కౌంట్ ధర
6GB + 128GB రూ. 29,999 రూ. 26,999
8GB + 128GB రూ. 32,999 రూ. 29,999
8GB + 256GB రూ. 35,999 రూ. 32,999
పోకో X8 పవర్
8GB + 128GB రూ. 35,999 రూ. 32,999
8GB + 256GB రూ. 38,999 రూ. 35,999

కలర్ ఆప్షన్లు: పోకో X8 పవర్ బ్లాక్ (Black), ఎల్లో (Yellow) రంగులలో లభిస్తుంది. కాగా పోకో X8 బ్లాక్ (Black), ఫైరీ ఆరెంజ్ (Fiery Orange), ఫ్రాస్ట్ వైట్ (Frost White) రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

సేల్ వివరాలు: ఈ రెండు ఫోన్‌లు సెప్టెంబర్ 11న Flipkart ద్వారా అమ్మకానికి రానున్నాయి.

రెండు మోడళ్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

  • డిస్​ప్లే: పోకో X8 పవర్, పోకో X8 రెండు మోడళ్లూ 6.83-అంగుళాల 1.5K (1,280 x 2,772 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్, 3,200Hz వరకు ఇన్‌స్టాంటేనియస్ టచ్ శాంప్లింగ్ రేట్, 3,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 100 శాతం DCI-P3 కలర్ గమట్, TUV ట్రిపుల్ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్లు, వెట్ టచ్ 2.0, కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్​తో వస్తంది
  • IP రేటింగ్: ఇవి దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లను కలిగి ఉన్నాయి.
  • ప్రాసెసర్: పోకో X8 పవర్ మోడల్ క్వాల్కమ్ 4nm ఆక్టా-కోర్ స్నాప్​డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 2.6GHz వరకు గరిష్ఠ క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. మరోవైపు, పోకో X8 మోడల్ ఆక్టా-కోర్ స్నాప్​డ్రాగన్ 6s జెన్ 4 SoCతో వస్తుంది. ఇది 2.4GHz వరకు గరిష్ఠ క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఈ రెండు ఫోన్‌లలోనూ అడ్రెనో GPU ఉంటుంది. ‘పవర్’ మోడల్ 8GB వరకు LPDDR5x RAM, 256GB వరకు UFS 4.1 స్టోరేజ్‌ను కలిగి ఉండగా, స్టాండర్డ్ మోడల్ LPDDR4x RAMతో వస్తుంది.
  • ఆపరేటింగ్ సిస్టమ్: ఈ రెండు డ్యూయల్ సిమ్ సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్‌లు షావోమీకి చెందిన Android 16-ఆధారిత HyperOS 3తో వస్తాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు నాలుగు OS అప్‌గ్రేడ్‌లు, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
  • కెమెరా సెటప్: కెమెరాల విషయానికొస్తే, ‘పోకో X8 పవర్’, ‘పోకో X8’ రెండింటిలోనూ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లు ఉన్నాయి. వీటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ (f/1.8) ప్రైమరీ రియర్ షూటర్ ఉంటుంది. ‘పవర్’ మోడల్‌లో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉండగా, ‘పోకో X8’లో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఇక ఫ్రంట్ కెమెరాల గురించి మాట్లాడుకుంటే, ‘పోకో X8 పవర్‌’లో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించగా, ‘పోకో X8’లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: ‘పోకో X8 పవర్’ మోడల్ 10,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరోవైపు, ‘పోకో X8’ మోడల్ 9,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలోనూ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అమర్చారు.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వివరాలు
డిస్​ప్లే Both: 120Hz | 6.83-అంగుళాల 1.5K FHD+ AMOLED
ప్రాసెసర్ స్నాప్​డ్రాగన్ 6s జెన్ 5 – X8
స్నాప్​డ్రాగన్ 6 జెన్ 5 – X8 పవర్
రియర్ కెమెరా 50MP (మెయిన్) + 2MP (సెకండరీ) – X8
50MP (మెయిన్) + 8MP (సెకండరీ) – X8 పవర్
ఫ్రంట్ కెమెరా 16MP – X8
32MP – X8 పవర్
బ్యాటరీ & ఛార్జింగ్ 9,000mAh with 67W (వైర్డ్) – X8
10,000mAh with 100W (వైర్డ్) – X8 పవర్
IP రేటింగ్ Both: IP66 + IP68 + IP69 + IP69K
OS Both: Android 16 ఆధారిత HyperOS 3
OS అప్‌గ్రేడ్ & సెక్యూరిటీ అప్‌డేట్ OS అప్‌గ్రేడ్: 4 generations – Both
సెక్యూరిటీ అప్‌డేట్: 6 years – Both

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!