E-PAPER

రజనీ-రామ్ ఢీ.. సంక్రాంతి బరిలో ‘ధర్మన్’.. మామా-అల్లుళ్ల ఈగో వార్‌కు రంగం సిద్ధం!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’. లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో రజనీకాంత్‌కు ధీటైన అల్లుడిగా రామ్ పోతినేని కనిపించనున్నట్లు తెలుస్తోంది. నెగిటివ్ షేడ్స్‌తో కూడిన పవర్‌ఫుల్ పాత్రలో రామ్ నటించనున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు రామ్ ఎనర్జీ తోడవడంతో మామా-అల్లుళ్ల మధ్య సాగే ఈగో వార్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సూపర్‌స్టార్ ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాబోయే సంక్రాంతి కానుకగా ‘ధర్మన్’ను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు అనుగుణంగా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేలా షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో పలు భారీ చిత్రాలు ఉండటంతో రజనీకాంత్ సినిమా కూడా బరిలోకి దిగితే పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!