E-PAPER

బరువు తగ్గేందుకు ఏ డైట్‌ బెస్ట్‌?.. కీటో డైట్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన అధ్యయనం

ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గేందుకు ఎలాంటి డైట్‌ను ఎంచుకోవాలనే దానిపై తరచూ సందేహాలు ఉంటాయి. తక్కువ కొవ్వు కలిగిన శాకాహార డైట్‌, మెడిటరేనియన్‌ డైట్‌, కీటోజెనిక్‌ డైట్‌ వంటి పలు విధానాలు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో ఒక్కో డైట్‌కు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

తాజాగా నిర్వహించిన ఓ చిన్న క్లినికల్‌ అధ్యయనంలో ఈ మూడు డైట్‌ విధానాలను పరిశోధకులు పోల్చి చూశారు. మూడు రకాల డైట్‌లను అనుసరించిన వారిలోనూ బరువు తగ్గే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. అయితే బరువు తగ్గడం ఒక్కటే కాకుండా శరీరంలోని ఇతర ఆరోగ్య సూచికలపై కూడా ఈ డైట్‌లు ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాన్ని పరిశీలించారు.

ఈ అధ్యయనంలో కీటోజెనిక్‌ డైట్‌ కాలేయ ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణకు సంబంధించి కొన్ని అదనపు ప్రయోజనాలు కలిగి ఉండొచ్చని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది చిన్న స్థాయి అధ్యయనం కావడంతో ఫలితాలను నిర్ధారించేందుకు మరిన్ని పరిశోధనలు అవసరం. ఏ డైట్‌ అయినా వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, పోషక అవసరాలకు అనుగుణంగా ఉండాలి కాబట్టి నిపుణుల సలహాతో ఆహార విధానాన్ని ఎంచుకోవడం మంచిది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!