E-PAPER

శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు


ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల పరిరక్షణకు జేఏసీ ఏర్పాటు

అన్ని వర్గాల సిబ్బంది ఐక్యంగా ముందుకు సాగాలి: ప్రిన్సిపాల్ కరుణ్ కుమార్

కొత్తగూడెం ,ఆగస్టు 17 (వై 7 న్యూస్) ;

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రతిపాదిత ‘శక్తి’ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇతర వ్యవస్థల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది జేఏసీని ఏర్పాటు చేశారు. సోమవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 11 మందితో స్థానిక జేఏసీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల ప్రత్యేకతను కాపాడుకోవడంతో పాటు సాంకేతిక విద్యా వ్యవస్థను పరిరక్షించేందుకు అన్ని వర్గాల సిబ్బంది ఐక్యంగా ఉద్యమించాలని ప్రిన్సిపాల్ బుగ్గే కరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లంచ్ అవర్‌లో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ‘శక్తి వద్దు.. పాలిటెక్నిక్ కళాశాలలు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు గ్రామీణ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాయని జేఏసీ సభ్యులు తెలిపారు. వాటిని ఇతర వ్యవస్థల్లో విలీనం చేయకుండా ప్రత్యేకతను కాపాడాలని, మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

కొత్తగూడెం లోకల్ జేఏసీ కార్యవర్గం

చైర్మన్‌గా ఎ. మాసయ్య, కో-చైర్మన్లుగా జీవీఆర్ లక్ష్మణ్ రావు, సీహెచ్ కృష్ణారావు, బి. మస్నా, కన్వీనర్‌గా డి. శ్రీనివాస్, కో-కన్వీనర్‌గా ఎం.డీ. ఫైజ్, పబ్లిక్ రిలేషన్ సెక్రటరీగా సీహెచ్ రవి కుమార్, మహిళా విభాగం సెక్రటరీగా పి. వనిత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టి. లింగ్య, కమ్యూనికేషన్స్ సెక్రటరీగా బి. రాము, కోశాధికారిగా డి. శశాంక్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జేఏసీలను ఏర్పాటు చేసి సెంట్రల్ జేఏసీతో అనుసంధానం చేస్తామని తెలిపారు. పాలిటెక్నిక్‌ల పరిరక్షణ కోసం బోధన, బోధనేతర, వర్క్‌షాప్, నాలుగో తరగతి సిబ్బంది అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ప్రిన్సిపాల్ కరుణ్ కుమార్, జేఏసీ సభ్యులు పిలుపునిచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!