స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL వినియోగదారులకు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ‘ఫైబర్ ఫ్రీడం ప్లాన్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ ద్వారా ఒకే కనెక్షన్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలను అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా 4G సేవలను మరింత విస్తరించేందుకు BSNL కీలక నిర్ణయం తీసుకుంది. 26,300కు పైగా అదనపు 4G BTS సైట్లను ఏర్పాటు చేసేందుకు సంస్థ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు కొత్త ప్రాంతాలకు 4G కనెక్టివిటీని తీసుకెళ్లేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.
కొత్త BTS సైట్ల ఏర్పాటుతో పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లోనూ BSNL 4G సేవలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీగా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై BSNL దృష్టి సారిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో కొత్త ప్లాన్‌తో పాటు 4G నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది.








