దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ములకపాడు సెంటర్లో వ్యాపారులు, చికెన్ షాపులు, ఫిష్ షాపుల యజమానులకు గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
సర్పంచ్ పెర్సిక తులసమ్మ, పంచాయతీ పాలకవర్గం సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ నోటీసులు అందజేశారు. చేపలు, కోళ్ల వ్యర్థాలు, ఇతర చెత్తను రహదారుల పక్కన లేదా సమీప కాలువల్లో వేయరాదని స్పష్టం చేశారు. వర్షపు నీరు, వ్యర్థ జలాలను డ్రైనేజీ వ్యవస్థ ద్వారా కల్వర్టులకు మళ్లించాలని సూచించారు.
గ్రామంలో పరిశుభ్రత, పారిశుధ్య పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పంచాయతీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పంచాయతీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పంచాయతీ కార్యదర్శి తీసుకునే చర్యలకు సంబంధిత వ్యాపారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.









