30 మందికి పైగా విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!
గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం..!
వి. అర్ పురం,( వై7 న్యూస్) జూలై 25: వి.ఆర్.పురం మండలం సోముల గూడెం బాలికల ఆశ్రమ పాఠశాల లో ఫుడ్ పాయిజన్ జరిగింది. పాడైపోయిన (కుళ్ళిపోయిన) పప్పు పెట్టడంతో ఆహారం తిన్న వెంటనే 30 మందికి పైగా విద్యార్థినులు తీవ్రమైన వాంతులు, విరోచనాలతో విలవిలలాడిపోయారు.
ప్రస్తుత పరిస్థితి
అస్వస్థతకు గురైన కొంతమంది విద్యార్థినులను చింతూరు ఏరియా హాస్పిటల్‌కు, మరికొంతమందిని కోతులగుట్ట హాస్పిటల్‌కు అత్యవసరంగా తరలించారు. ఆసుపత్రుల్లో విద్యార్థినులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు:
పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులపై, బాధ్యులైన పాఠశాల సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.








