E-PAPER

బరువు తగ్గుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే డైట్ మార్చాల్సిందే!

బరువు తగ్గడం అంటే కేవలం శరీర బరువు తగ్గడం మాత్రమే కాదు.. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. అయితే త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది కఠినమైన డైట్‌లు, తక్కువ కేలరీల ఆహారం, అధిక వ్యాయామాన్ని అనుసరిస్తుంటారు. దీంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఫిట్‌నెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బరువు తగ్గే సమయంలో రోజంతా ఆహారం గురించే ఆలోచనలు రావడం, తరచూ ఆకలి వేయడం, ఎప్పుడూ ఏదైనా తినాలనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ డైట్ చాలా కఠినంగా ఉందని అర్థం. ఇవి శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు తగినంతగా అందడం లేదనే సంకేతాలుగా భావించాలి.

అప్పుడప్పుడు తినాలనే కోరిక రావడం సహజమే అయినప్పటికీ, ఎప్పుడూ ఆహారం గురించే ఆలోచించడం ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే పోషకాహార నిపుణుల సలహాతో సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా డైట్‌ను సవరించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News