E-PAPER

Sony LinkBuds Clip లాంచ్.. ఓపెన్ ఇయర్ డిజైన్, 37 గంటల బ్యాటరీతో కొత్త TWS ఇయర్‌బడ్స్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ భారత మార్కెట్లో కొత్త లింక్ బడ్స్ క్లిప్ (LinkBuds Clip) ఓపెన్ ఇయర్ ట్రూ వైర్‌లెస్ (TWS) ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌ను గతంలో జనవరిలో ఉత్తర అమెరికా మార్కెట్లో లాంచ్ చేసిన సోనీ, ఇప్పుడు భారత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకమైన ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్, AI ఆధారిత కాల్ క్వాలిటీ, Bluetooth Multipoint కనెక్టివిటీ, 37 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లతో ఇవి రూపొందాయి.

Sony LinkBuds Clipలో సంప్రదాయ ఇన్-ఇయర్ డిజైన్‌కు భిన్నంగా ఓపెన్ ఇయర్ క్లిప్ స్టైల్‌ను అందించారు. ఈ డిజైన్ కారణంగా చెవి పూర్తిగా మూసుకుపోకుండా ఉంటుంది. దీంతో పాటలు వింటూనే చుట్టూ ఉన్న శబ్దాలను కూడా వినగలుగుతారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో, ఆఫీస్‌లో లేదా వర్కౌట్ చేస్తున్నప్పుడు పరిసరాలపై అవగాహన కోల్పోకుండా ఉండేందుకు ఈ డిజైన్ ఉపయోగపడుతుంది.

వివిధ రకాల చెవి ఆకృతులకు సరిపోయేలా ప్రత్యేక ఫిట్టింగ్ కుషన్స్‌ను కూడా సోనీ అందించింది. దీంతో ఎక్కువ సమయం ఉపయోగించినా సౌకర్యవంతమైన అనుభూతి కలిగేలా రూపొందించారు. AI ఆధారిత కాల్ టెక్నాలజీ, మెరుగైన సౌండ్ అనుభవం, మల్టీ డివైస్ కనెక్టివిటీతో Sony LinkBuds Clip ప్రీమియం TWS విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News