స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 16ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ Digital Chat Station చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో షేర్ చేసిన సమాచారం ప్రకారం, iQOO 16 శక్తివంతమైన హార్డ్‌వేర్, ప్రీమియం ఫీచర్లతో రానుందని తెలుస్తోంది.
లీకైన వివరాల ప్రకారం, iQOO 16లో క్వాల్‌కామ్ తాజా Snapdragon 8 Elite Gen 6 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌తో హై-ఎండ్ గేమింగ్, వేగవంతమైన మల్టీటాస్కింగ్, AI ఆధారిత ఫీచర్లలో మెరుగైన పనితీరు లభించనుందని అంచనా వేస్తున్నారు.
గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌లో ప్రత్యేక గ్రాఫిక్స్ చిప్, 0916 సిరీస్ X-Axis లీనియర్ మోటార్, అలాగే 1115 సిరీస్ హై-ఎండ్ సిమెట్రికల్ డ్యూయల్ స్పీకర్లు అందించే అవకాశం ఉందని సమాచారం. భారీ బ్యాటరీతో పాటు ప్రీమియం డిజైన్, అధునాతన ఫీచర్లతో iQOO 16 ఫ్లాగ్‌షిప్ విభాగంలో పోటీ ఇవ్వనుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, విడుదల తేదీపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.









