E-PAPER

టామ్ క్రూజ్‌ షాకింగ్ లుక్.. ‘డిగ్గర్’లో ఊహించని పాత్రలో హాలీవుడ్ స్టార్

హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ అంటే యాక్షన్, స్టైలిష్ లుక్, ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తుకొస్తారు. అయితే తాజాగా ఆయన కొత్త సినిమా ‘డిగ్గర్’లో పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించబోతున్నారు. విడుదలైన ట్రైలర్‌లో టామ్ క్రూజ్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పెరిగిన పొట్ట, చెదిరిన జుట్టు, ముఖంపై ముడతలతో ఉన్న ఆయన లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆస్కార్ విజేత అలెజాండ్రో జి. ఇనారిటు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టామ్ క్రూజ్ బిలియనీర్ ఆయిల్ టైకూన్ డిగ్గర్ రాక్‌వెల్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడిపే వ్యాపారవేత్తగా కనిపించిన ఆయన, తన కంపెనీ కారణంగా జరిగిన పర్యావరణ విపత్తు తర్వాత జీవితంలో భారీ మార్పును ఎదుర్కొంటాడని తెలుస్తోంది.

కరుగుతున్న మంచు పర్వతాలు, ప్రకృతి విధ్వంసం, అణుయుద్ధ ముప్పు వంటి అంశాలతో ‘డిగ్గర్’ ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఉన్న డిగ్గర్ రాక్‌వెల్, చివరికి మానవాళిని కాపాడే వ్యక్తిగా ఎలా మారుతాడనే అంశం చుట్టూ కథ సాగనుందని సమాచారం. ఈ విభిన్న పాత్రతో టామ్ క్రూజ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News