E-PAPER

సబాంగ్ పోర్టుతో భారత్‌కు వ్యూహాత్మక బలం.. చైనాలో పెరుగుతున్న ఆందోళన

 

ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో కీలక ఒప్పందం కుదిరింది. వెహ్ ద్వీపంలోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన సబాంగ్ పోర్టును భారత్-ఇండోనేషియా సంయుక్తంగా అభివృద్ధి చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ ఒప్పందం రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది.

సబాంగ్ పోర్టు మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉండటం దీని ప్రత్యేకత. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 40 శాతం ఈ జలసంధి గుండా సాగుతుంది. ముఖ్యంగా చైనా చమురు దిగుమతుల్లో సుమారు 80 శాతం, భారీ వాణిజ్యం ఈ మార్గంపైనే ఆధారపడుతోంది. అందుకే మలక్కా జలసంధిని చైనా తన వ్యూహాత్మక బలహీనతగా భావిస్తూ “మలక్కా డైలామా”గా పేర్కొంటుంది.

ఈ నేపథ్యంలో సబాంగ్ పోర్టు అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం కావడం చైనాకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ పోర్టు ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, కీలక సముద్ర వాణిజ్య మార్గాలపై పర్యవేక్షణ సామర్థ్యాన్ని కూడా పెంచుకోనుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News