దుమ్ముగూడెం , జూలై 06 (వై 7 న్యూస్ );
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని ఏఐసీసీ కోఆర్డినేటర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆలం కుసుము తాయి ఈరోజు సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పెద్దబండి రేవు గ్రామంలో ఆదివాసి ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు ఆలం కుసుము తాయి తెలిపారు. ఆదివాసీల సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తెల్లం హరి, జిల్లా జనరల్ సెక్రటరీ పిలక వెంకటరమణ రెడ్డి, జిల్లా కార్యదర్శి జిందాల్, ఉప సర్పంచ్ శ్రీధర్, యువజన నాయకుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.








