ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అనంతరం నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 22.55 లక్షల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) తొలగించింది. ఈ తొలగింపులు ఆయా రాష్ట్రాల్లోని మొత్తం 3.68 కోట్ల ఓటర్లలో సుమారు 6.12 శాతం ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఆదివారం ఒడిశా, మణిపూర్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా అనర్హులైన ఓటర్ల వివరాలను తొలగించినట్లు తెలిపింది.
మరణం, శాశ్వత నివాసం మారడం, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరుగా నమోదు కావడం వంటి కారణాలతో 22.55 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అభ్యంతరాలు, సవరణల ప్రక్రియ పూర్తైన అనంతరం తుది ఓటర్ల జాబితాను ప్రకటించనుంది.
Post Views: 5








