E-PAPER

వివాహిత ఆత్మహత్య.. మందస మండలంలో విషాదం

శ్రీకాకుళం జిల్లా పలాస వై 7 న్యూస్ | జూలై 1

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బైరిసారంగిపురం గ్రామంలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిమ్మన సరోజిని (46) అనే వివాహిత తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందింది.

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం సరోజిని కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. అనారోగ్యం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

సమాచారం అందుకున్న మందస పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఘటనకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం. సరోజిని మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News