E-PAPER

కరకగూడెం గౌడ కుల పెద్దమనిషిగా కొంపెలి రామలింగం ఎన్నిక

కరకగూడెం, జూలై 30 (వై సెవెన్ తెలుగు న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో గౌడ సమాజానికి చెందిన కుల ఆస్తుల పెద్దమనిషిగా కొంపెలి రామలింగం గౌడ్ ఎన్నికయ్యారు. అలాగే రావుల కనకయ్య, చీకటి లక్ష్మయ్యలు కీలక బాధ్యతలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులకు పలువురు గౌడ సమాజ ప్రముఖులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి నాయకత్వంలో గౌడ సమాజం మరింత అభివృద్ధి చెంది, ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సమాజ సంక్షేమం, అభివృద్ధి కోసం వారు చేపట్టే కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

– రిపోర్టర్ దిలీప్

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News