E-PAPER

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి..! ; వెంకన్న చౌదరి పిలుపు

పలాస, జూన్ 30 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో మంగళవారం పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధికి చెందిన ముఖ్య నాయకులతో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారికి అండగా నిలవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ విజయానికి కార్యకర్తలే బలమని, అందరూ సమన్వయంతో పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని వెంకన్న చౌదరి పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News