భద్రాచలం, జూన్ 28:
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జూన్ 29, సోమవారం గిరిజన దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గిరిజనులు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులను సమర్పించాలని కోరారు. గిరిజనుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖల యూనిట్ అధికారులు ఉదయం 10:30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. గిరిజనుల వినతులు, ఫిర్యాదులను సకాలంలో పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
– సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ తమ్మళ్ళ

Post Views: 5








