భద్రాచలం, జూన్ 28:
భద్రాచలం డివిజన్ ప్రజల సౌకర్యార్థం జూన్ 29, సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తెలిపారు.
ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు భూ సమస్యల పరిష్కారం, వ్యక్తిగత సమస్యలు అలాగే వివిధ శాఖలకు సంబంధించిన ఇతర సమస్యలపై లిఖితపూర్వకంగా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అలాగే డివిజన్ స్థాయి అన్ని శాఖల అధికారులు ఉదయం 10:30 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి తప్పనిసరిగా హాజరై ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.
– సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ తమ్మళ్ళ
Post Views: 4








