E-PAPER

తుడుం దెబ్బ జిల్లా అధికార ప్రతినిధిగా పద్దం శ్రీనివాస్ నియామకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూన్ 28:

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధిగా పద్దం శ్రీనివాస్‌ను నియమించారు.

ఈ సందర్భంగా పద్దం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం సంస్థ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దారబోయిన రమేష్‌తో పాటు జిల్లా, మండల స్థాయి ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News