వై7 న్యూస్ – మణుగూరు
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ స్టేట్ ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ శిరీష ఆధ్వర్యంలో మణుగూరులో ముఖ్య సమావేశం జరిగింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రతినిధులు, నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను వివరించారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించేందుకు సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను శాలువాతో సన్మానించి, తమ వంతు సహకారం అందిస్తామని ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా స్టేట్ ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ శిరీష, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆశ, సెక్రటరీలు ఉమా, రోహిణి, కుమారి పాల్గొన్నారు.
Post Views: 37








