E-PAPER

భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినిగా మారిన మహిళా ఎస్సై అమూల్య

భూపాలపల్లి, మార్చి 28:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక వినూత్న ఘటన చోటుచేసుకుంది. టేకుమట్ల పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా ఎస్సై అమూల్య, విద్యార్థినిగా మారి ఆకతాయిలకు గట్టి బుద్ధి చెప్పారు.
ఇటీవల పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని అరికట్టేందుకు ఎస్సై అమూల్య ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఖాకీ యూనిఫాం వదిలి, సాధారణ విద్యార్థినిలా ఎరుపు రంగు దుస్తులు ధరించి, చేతిలో పుస్తకాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.
అక్కడ విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిలను గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సీక్రెట్ ఆపరేషన్‌తో పోలీసులు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంటారని ఎస్సై అమూల్య నిరూపించారు. ఆమె ధైర్యం, సమయస్ఫూర్తిని స్థానికులు ప్రశంసిస్తూ, ఇది ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News