E-PAPER

అక్రమ సంబంధాలు, మహిళా హత్య, ఒకరి అరెస్ట్

మెదక్ వెల్దుర్తి, డిసెంబర్ 6

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామ శివారులో మహిళా మృతదేహం లభ్యమైన ఘటన వెనుక అక్రమ సంబంధాల వివాదమే కారణమని దర్యాప్తులో వెల్లడైందని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారనీ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… దాసరి సత్తయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను, భార్య దాసరి నర్సమ్మ (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. వారికి వంశీ (21), ప్రశాంత్ (18) అనే ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పారు. డిసెంబర్ 2న సాయంత్రం 7:30 గంటలకు పెద్ద కుమారుడు, భార్య మధ్య వంట విషయం పై తగాదా జరిగినప్పటికీ తరువాత అందరూ భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సమ్మ ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని, గ్రామంలో, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదని తెలిపారు. డిసెంబర్ 5న సాయంత్రం 4 గంటల సమయంలో, షెరిల్ల గ్రామానికి చెందిన సల్లా మహేష్, సత్తయ్య సోదరుడు శ్రీనివాస్‌కు ఫోన్ చేసి నెల్లూరు గ్రామ పరిధి బక్క మర్రి వద్ద ఒక మహిళ మృతదేహం కనిపించిందని తెలిపాడు. సమాచారం అందుకున్న సత్తయ్య అక్కడకు వెళ్లగా, అది తన భార్య నర్సమ్మ మృతదేహమని గుర్తించాడు. మృతదేహం కుండెక్కిన స్థితిలో ఉండగా, ముఖం నల్లబడి, పురుగులు పడి, శవం ఒరిగి పడి ఉన్నట్లు, అలాగే గొంతుకు బట్టతో బిగించబడిన దూరం స్పష్టంగా కనిపించిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. సత్తయ్య తన ఫిర్యాదులో,
తమ గ్రామానికి చెందిన దారా మల్లేష్, తమ కొడుకుతో కలిసి భార్య నర్సమ్మతో గత కొన్ని నెలలుగా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉండడమే కాక, ఒకసారి ఇద్దరూ తమ ఇంట్లోనే దొరికిపోయారని, పెద్దలు మందలించినప్పటికీ సంబంధం నిలువలేదని, ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. అందువల్ల తన భార్యను మల్లేష్ హత్య చేసి ఉండొచ్చని తన అనుమానాన్ని వెల్లడించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, తూప్రాన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగకృష్ణ, యెల్దుర్తి ఎస్ ఐ రాజు సిబ్బంది కలిసి నిందితుడు దారా మల్లేష్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో,
డిసెంబర్ 3న మల్లేష్, నర్సమ్మ ఇద్దరూ నెల్లూరు శివారుకు వెళ్లగా అక్కడ అక్రమ సంబంధాల విషయంపై వాగ్వాదం జరిగిందని, పరిస్థితి ఉద్రిక్తమయ్యాక రెండువైపులా గొడవలు కొనసాగుతాయని భావించి, నర్సమ్మ గొంతును నులిమి చంపినట్లు మల్లేష్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శవాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు అతడు అంగీకరించాడు. నిందితుడు దారా మల్లేష్‌ను పోలీసులు న్యాయపరమైన చర్యల కోసం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో వెల్దుర్తి ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News