మణుగూరు | వై 7 న్యూస్
మణుగూరు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్–టిడిపి పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, టిడిపి అభ్యర్థి బచ్చల భారతి పట్ల ప్రజాభిమానం వేగంగా పెరుగుతోంది.
మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయతీలో భారతి కి మద్దతు వెల్లువ కొనసాగుతున్న నేపథ్యంలో, నేడు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు గురజాల గోపి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గురజాల గోపి మాట్లాడుతూ,”సమితి సింగారం అభివృద్ధి కోసం బచ్చల భారతి విజయం కీలకం అని , గ్రామ ప్రజలు 5 నెంబర్ హ్యాండ్‌బ్యాగ్ గుర్తుపై ఓటు వేసి ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలి” అని పిలుపునిచ్చారు.
అలాగే రేణుక అక్షర మహిళా మండలి సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన,
“ప్రతి మహిళా కార్యకర్త ప్రచారంలో ముందుండి నిలిచి భారతి గారి విజయం కోసం శక్తివంచన లేకుండా పని చేయాలి” అని సూచించారు.
ఈ సమావేశంలో మహిళా మండలి అధ్యక్షురాలు పూనేం సరోజ,సీనియర్ నాయకురాలు ఎండి షబానా,ఉపాధ్యక్షురాలు బొడ్డు సౌజన్య,రెడ్డబోయిన రేణుక,డేరంగుల సుజాత,కన్నారపు వసంత,కన్నారపు శైలజ,బాడీస పార్వతి,తో పాటు పలువురు కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.
స్థానికంగా అభిప్రాయాలు, బచ్చల భారతి పట్ల మద్దతు మరింతగా పెరుగుతోందనే దిశగా వినిపిస్తున్నాయి.









