వై 7 న్యూస్ పలాస
పలాస కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. గురువారం సాయంత్రం పలాసలో దువ్వాడ శ్రీధర్ (బాబా) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా దువ్వాడ శ్రీధర్ మాట్లాడుతూ,
“వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను పునర్వ్యవస్థీకరించి, పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. అభివృద్ధికి ఇది అత్యవసరం” అని అన్నారు.ప్రాంతీయ సమస్యలు, ప్రజల నిత్యవసరాలపై మెరుగైన పరిపాలన అందించాలంటే పలాస జిల్లా కావడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.ఈ ఉద్యమాన్ని పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొనసాగిస్తామని తెలిపారు.
సమావేశంలో పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, మేధావులు, ఉద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 50









