E-PAPER

50,000 దాటితే నగదు స్వాధీనం.డిప్యూటీ ఎన్నికల అధికారి తూప్రాన్ ఆర్.డి.ఓ జయ చంద్రా రెడ్డి.

తూప్రాన్ డిసెంబర్ 05

గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా గురువారం తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసు కార్యాలయంలో తహసీల్దార్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు స్టాటిస్టిక్ సర్వ్యైవల్ బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎన్నికల నిబంధనలు,పర్యవేక్షణ విధానాలు,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు,పోలింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు,అలాగే ఫీల్డ్‌లో తక్షణ స్పందన విధానాలపై వివరంగా తెలియజేశారు.ఈ సందర్భంగా ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలకు సూచనలు ఇస్తూ….ఎన్నికల సమయంలో అక్రమాలు నగదు/బహుమతుల పంపిణీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు వంటి ఘటనలపై వెంటనే స్పందించాలనీ.ఎస్‌.ఎస్.టీ. బృందాలు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యంగా చెక్‌పోస్టులు,రహదారులు,జంక్షన్లు వంటి స్థిర ప్రదేశాల్లో తనిఖీలు చేయాలని వాహనాలను,వ్యక్తులను తనిఖీ చేసి నగదు/బహుమతుల అక్రమ రవాణాను ఆపాలని ఆదేశించారు.మద్యం మరియు యాభై వేల కంటే ఎక్కువ నగదు సరఫరా జరగకుండా నిరోధించేందుకు ఎఫ్ఎస్టీ,ఎస్ఎస్టీ బృందాలు పర్యవేక్షణ చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా ఆర్డీవో తెలిపారు.ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల సందర్భంలో ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ బృందాలు నగదు స్వాధీనం చేసుకున్న పక్షంలో సంబంధిత వ్యక్తులు అట్టి నగదు తమ వ్యక్తిగత మరియు చట్టబద్ధ ప్రయోజనాల కోసం తీసుకువెళుతున్నట్లు ఆధారాలు సమర్పించి,ఆర్‌.డి‌.ఓ కార్యాలయం వద్ద అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.సమర్పించిన ఆధారాలు పరిశీలించిన తరువాత,నిబంధనలకు అనుగుణంగా నగదు విడుదల చేసే అధికారం ఆర్‌.డి‌.ఓ కు ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ డివిజన్ మండలాల తహశీల్దార్లు రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News