E-PAPER

తూప్రాన్ టోల్ గేట్ వద్ద 285 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత.లారీ సీజ్ – డ్రైవర్ అరెస్ట్

తూప్రాన్, డిసెంబర్. 05

మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ వద్ద భారీ స్థాయిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు గురువారం ఉదయం 7 గంటలకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, రంగురంగుల సంచుల్లో మొత్తం 285.70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం తరలింపును గుర్తించి లారీని సీజ్ చేశాయి. తనిఖీ వివరాలు ఇలా ఈటిఎఫ్ టీం, హైద్రాబాద్, తూప్రాన్ ఎస్ ఐ శివానందం పోలీసులు, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తాటి నర్సింలు తదితరులు పాల్గొన్న ఈ తనిఖీల్లో లారీ నంబర్ TS 16 UB 2731 ను అడ్డుకొని పరిశీలించారు. లారీలో పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యం ఉందని గుర్తించిన అధికారులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ షేక్ మస్తాన్ (జిల్లపల్లి ఫారం, కోటగిరి, నిజామాబాద్ జిల్లా) తెలిపిన వివరాల ప్రకారం, ఈ బియ్యాన్ని శ్రీ మల్లిఖార్జున ట్రేడర్స్, ప్లాట్ నెం. 77, ఫేజ్–III, లాల్‌పేట్ ఇండస్ట్రియల్ పార్క్, పాషా మైలారం రోడ్, సంగారెడ్డి నుండి రంపూర్–నిజామాబాద్ కు లోడ్ చేశారన్నారు. అనంతరం మాన ట్రేడర్స్ అధీనంలోని సుబరెడ్డి వద్ద నుండి బియ్యం తీసుకొని ఇది వడవు కండల్ వాడీ, మక్కాష్ రోడ్, విలాటి, నాందేడ్ వైపు తరలిస్తున్నట్టు వెల్లడించాడు. అక్రమ రవాణాకు ఉపయోగించిన విధానం లారీలో మొత్తం 565 రంగురంగుల ప్లాస్టిక్ సంచులు, ప్యాకింగ్ మెటీరియల్, వైబ్రేటర్‌లతో పాటు మొత్తం 285.70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి రవాణా చేస్తున్న స్పష్టమైన నేరమని పోలీసులు చెప్పారు. వాహనం సీజ్ – కేసు నమోదు సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తాటి నర్సింలు ఫిర్యాదు మేరకు
తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివానందం తెలిపారు. లారీ (టి.ఎస్ 16 యు.బి 2731)ని సీజ్ చేసి, కేసు పూర్తయ్యే వరకు సురక్షిత కస్టడీలో ఉంచినట్టు పేర్కొన్నారు. అక్రమంగా ప్రభుత్వ బియ్యాన్ని కొనుగోలు చేసి రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News