-శేరిపల్లి గ్రామ సర్పంచ్ గా ఆశీర్వదించండి..
మెదక్ జిల్లా నార్సింగి డిసెంబర్ 05:
మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ జమాల్పురి పద్మ రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.వివరాల్లోకి వెళ్తే నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన జమాల్పురి పద్మా రమేష్ మంగళవారం నాడు చివరి నిమిషంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నాడు శేరిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల నామినేషన్ల కౌంటర్లో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పద్మా రమేష్ మాట్లాడుతూ…గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి తమ కుటుంబం నుండి రెండు సార్లు సర్పంచ్ గా గెలిచి గ్రామాభివృద్ధికి తోడ్పడ్డామనీ గ్రామంలో అన్ని సామాజిక వర్గాలను సమన్వయంతో కలుపుకొని గ్రామాభివృద్ధికి శాయశక్తుల కృషి చేశామనీ,గ్రామ ప్రజలు ఈసారి కూడా తమకు సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా నామినేషన్ వేయడానికి గ్రామ ప్రజలందరూ తమకు ధైర్యాన్నిచ్చి తోడుగా వచ్చిన అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఓటు వేసి గెలిపించాలని మీడియా ద్వారా కోరారు.









